కోదాడ,జులై 10 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండలం తొగర్రాయి పల్లె దవాఖానా శంకుస్థాపన కార్యక్రమంను గ్రామ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు.వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 122 పల్లె దవాఖానాల నిర్మాణానికి ఏర్పాట్లు,గ్రామాలలో పల్లె దవాఖాన వైద్యుల సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.134 వైద్య పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని,తమ చరవాణి కే రిపోర్టులు పంపించడం జరుగుతుందని అన్నారు.అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అన్ని గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తలు 29 సంవత్సరాలు నుండి 30 వ సంవత్సరం లోకి వచ్చిన ప్రతి ఒక్కరి మధుమేహ పరీక్షలు మరియు రక్త పోటు పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. బిపి మరియు షుగర్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని,గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తల వద్ద లభించు మాత్రలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.అనంతరం పల్లె దవాఖానా రికార్డులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,కాపుగల్లు వైద్యాధికారి డాక్టర్ ధర్మతేజ,స్థానిక సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ,సూపర్వైజర్ సిద్ధమ్మ,టీఎస్ ఎంఐడిసి అధికారులు అనిరుధ్,ఆరోగ్య కార్యకర్త ప్రమీల,పంచాయతీ కార్యదర్శి అవినాష్,ఏడుకొండలు,నాగరాజు,యలమర్తి రాము,కలకొండ బిక్షం,అమరబోయన వీరబాబు,ఆశా కార్యకర్తలు సైదమ్మ,నాగలక్ష్మి,నాగమణి,రోశమ్మ తదితరులు ఉన్నారు
పల్లె దవాఖానా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
RELATED ARTICLES