కోదాడ,జులై 16(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:95% నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరివాహక ప్రాంతం ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా ప్రవహిస్తుంది.దుర్మార్గం ఏమిటంటే ప్రవహించేది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..నీళ్ళు పారేది ఖమ్మం జిల్లా పాలేరులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క చెరువు కూడా నింపకుండా ఎక్కడికక్కడ గేట్లు మూసివేసి నేరుగా పాలేరు రిజర్వాయర్ కు పంపిస్తున్నారు.వర్షాలు రాక,చెరువులో నీళ్ళు లేక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.దీంతో బోరు బావుల్లో నీళ్ళు తగ్గడం వల్ల రైతులు డి.యస్.ఆర్ పద్ధతిలో వడ్లు వెద చల్లటానికి,నారు పోసి నాట్లు వేయటానికి దుక్కులు తడవక వ్యవసాయం చేయటానికి,రైతు అష్టకష్టాలు పడుతున్నారు.దీనిపై అధికారులు,ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ స్పందించి కనీసం చెరువులు నింపడానికైన మునగాల దగ్గర గేట్లు ఎత్తి ముత్యాల కాలువకు నీళ్ళు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
చెరువులు నింపడానికి నీళ్ళు విడుదల చేయాలి -కందుకూరి ఉపేందర్ బీయస్పీ జిల్లా ఈసీ మెంబర్
RELATED ARTICLES