Monday, July 7, 2025
[t4b-ticker]

రైతుబంధు డబ్బులు రైతుల రుణాల వడ్డీలకే సరిపోవటం లేదు: డాక్టర్ అంజి యాదవ్:డంపింగ్ యార్డ్ వలన అనారోగ్యం పాలవుతున్న వెంకటరాంపురం ప్రజలు:డాక్టర్ అంజి యాదవ్: గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి:డాక్టర్ అంజి యాదవ్

అనంతగిరి,జులై 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులను దగా చేస్తూ వారి డబ్బులతోటే రైతు రుణాల వడ్డీలు కట్టించుకుంటుందని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.సోమవారం 4వ రోజు మన ఊరుకు మన గడపకు మన అంజన్న కార్యక్రమం అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం వెంకటరాంపురం పాత గోల్ తండా కొత్త గోల్ తండా వసంతపురం సింగారం గ్రామాలలో నిర్వహించారు.ముందుగా ఖానాపురం గ్రామంలో పలువురికి ఆర్థిక సహాయం చేసిన అంజి యాదవ్.వెంకటరాంపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసినారు.ఈ సందర్భంగా డాక్టర్ అంజి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు డబ్బులు ఇస్తూ అదే డబ్బులను రైతు రుణాల కు వడ్డీల రూపంలో రైతుల వద్ద నుండి గుంజుకుంటుందని అన్నారు.

వెంకటరాంపురం గ్రామంలో డంపింగ్ యార్డ్ వలన అక్కడి నీరు కలుషితమయి గ్రామం లో ఉన్న ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్న సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ కార్మికులు 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి పై చవితి తల్లి ప్రేమ చూపుతూ వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చటంలో వెనకడుగు వేస్తుందని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు యొక్క శ్రమ వలనే గ్రామాలలో వ్యర్ధాలు లేకుండా చేస్తున్న శ్రమ ఎంతో గొప్పదని కొనియాడారు. బీసీ బందు పేరుతో బీసీలను ఇంకా మోసం చేస్తూ వారి ఓట్లు దోచుకోవాలని బీసీ బందు పెట్టి బీసీలను దరఖాస్తు చేసుకోమని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కులాలకే కేటాయించడం సబబు కాదని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్,కతిమాల వెంకన్న,వీరలక్ష్మి,శ్రీవాణి,బండి గోపి,సాయి గోపి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular