హైదరాబాద్ :జులై 18(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి సునితతో కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, రామచంద్ర నాయక్, అనిల్ కుర్మాచలం, రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి చేరుకున్న జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రితో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.