హైదరాబాద్:(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు); జులై 19
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. అయితే కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసనకు దిగారు. పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు వీసీ ఛాంబర్ వెళ్తున్న విద్యార్థులను హాస్టల్‌లోనే ఓయూ సెక్యూరిటీ బంధించింది. దీంతో ఈరోజు బుధవారం ఓయూలో జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలకు విద్యార్థులు బాయ్ కాట్ చేశారు. వర్షంలోనే విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.