కోదాడ,జులై 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మణిపూర్ రాష్ట్ర ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరి పై నిరసనగా నడిగూడెం మండల కేంద్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్య గత రెండు నెలల నుండి హింస చెలరేగి వందల మంది ప్రాణాలు పోతున్న, ఒక మహిళను నగ్నంగా ఊరేగించి హింసించి అత్యాచారం చేసిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారు అలాగే ఆ రాష్ట్రం సమస్య పరిష్కరించ కుండ ప్రపంచ దేశాలు తిరుగుతూ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాకుండా,జాతుల మధ్య వైరం సృష్టిస్తుందని ప్రపంచ దేశాల ముందు మన భారతదేశం ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని అన్నారు.అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని,ఘటనపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన,దేశం మొత్తం ఘటనపై స్పందిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మణిపూర్ అల్లర్లను అరికట్టాలని అక్కడ శాంతి నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు,మండల అధ్యక్షుడు జమ్మి ఎల్లయ్య,నాయకులు కాసాని రాంబాబు,కొరట్ల బ్రహ్మయ్య,వినోద్,బొడ్డు సిద్దు,కోటి,సైదులు,లింగయ్య,అంజి, తదితరులు పాల్గొన్నారు.
మణిపూర్ దోషాలను శిక్షించాలి:డివైఎఫ్ఐ
RELATED ARTICLES