కోదాడ,జులై 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నియోజకవర్గ అధ్యక్షులు జీ ఆర్ అబ్రహం అధ్యక్షతన స్థానిక నయనగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో జరిగిన క్రైస్తవ నాయకుల సమావేశం లో మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు,స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను,పాస్టర్లను ఘోరంగా అవమానించి చంపుతున్న మతోన్మాదాన్ని అణిచివేయాలని మణిపూర్ లో జరిగిన సంఘటనలకు నిరసనగా కోదాడ నియోజకవర్గ క్రైస్తవ సంఘాలు రేపు అనగా 23.07.23 సాయంత్రం 3:00 గంటలకు భారీ నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపడతామని యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు జి ఆర్ అబ్రహం,చీఫ్ కోఆర్డినేటర్ రెవరెండ్ వి యేసయ్య అన్నారు.ఈ భారి నిరసన ప్రదర్శనలో ప్రతి ప్రజా సంఘాలు,రాజకీయ పార్టీలు పాల్గొని మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు.నియోజకవర్గ క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు వంటిపాక జానకి ఏసయ్య,బిషప్ జె సుదర్శన్,ఏజే సామ్యూల్ పాల్గొని మణిపూర్ లో క్రైస్తవ సంఘాల పై జరుగుతున్న దాడులను ఖండించారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు
ఈ సందర్భంగా కోదాడ పట్టణానికి నూతనంగా వచ్చిన డిఎస్పిని అభినందనలు తెలియజేసి ఇట్టి శాంతియుత కార్యక్రమానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ అధ్యక్షులు జోసెఫ్ రాజ్,చిలుకూరు మండల అధ్యక్షులు రమేష్,అంతగిరి మండల అధ్యక్షులు బ్రదర్ రామారావు,కోదాడ మండల అధ్యక్షులు రూఫస్ నాయక్,మునగాల మండల క్రైస్తవ నాయకులు జై జై సామ్యూల్,మోతే మండల అధ్యక్షులు లాజరస్
మరియు క్రైస్తవ సంఘాల నాయకులు పౌలు చారి,ప్రభుదాస్,అబ్రహం,లీగల్ అడ్వైజర్ లాయర్ రామకృష్ణ,రాము ,రవితేజ దానియేలు తదితరులు పాల్గొన్నారు.
మణిపూర్ క్రైస్తవులపై దాడులకు నిరసనగా క్రైస్తవ సంఘాల మరియు వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన
RELATED ARTICLES