నడిగూడెం,జులై 24(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు యువ నాయకత్వాన్ని కోరుకుంటుందని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు. సోమవారం 8వ రోజు మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమంలో భాగంగా నడిగూడెం మండలం పరిధిలోని వల్లపురం,సిరిపురం,నారాయణపురం,కాగిత రామచంద్రపురం,కరివిరాల గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం లో ఇప్పటివరకు పాలించిన ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించారని అన్నారు. నియోజకవర్గం లో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతర నాయకత్వం అవసరమని గ్రామాలలో యువకులు,వృద్ధులు, మహిళలు అన్ని కులాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

ఇంకా నడిగూడెం మండలంలో గల గ్రామాలలో రోడ్లమీదకు డ్రైనేజ్ వాటర్ వచ్చి చుట్టుపక్కల ప్రజలకు దుర్గన్న వెదజల్లుతున్న అధికారులు నిమ్మకు నీరు ఎట్టినట్లు వివరిస్తున్నారని అన్నారు. నారాయణపురం గ్రామంలో ప్రధాన రహదారి కిలోమీటర్ రోడ్డుని పూర్తి చేయకుండా గత ఐదు సంవత్సరాల నుండి మధ్యలోనే వదిలేయడం వలన గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బంది పడుతూ ఆ గుంటలలో కింద పడి కాళ్లు చేతులు విరిగిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయని ప్రజలు నా దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు. మండలంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్,కతిమాల వెంకన్న, మాలోవత్ బాలు,బండి గోపి,జగ్య, బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.