హుజూర్ నగర్,జులై 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మేళ్ళచెరువు మండల కేంద్రంలో మండల తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కి మైహోం సిమెంట్ యాజమాన్యం వారు యూనిట్-4 నిర్మాణాలకు నిజంగా అనుమతులు ఉంటే…
మై హోమ్ నిర్మాణాలు సక్రమమే అయితే.అనుమతి పత్రాలు బయటపెట్టాలి.మైహోమ్ యూనిట్-4 నిర్మాణాలకు అనుమతులు లేవని గతంలో నిర్మాణాలు నిలిపివేసిన అధికారులు ఎందుకు మైహోం పై చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వం చేత పత్రం విడుదల చేయాలి.అక్రమ నిర్మాణాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులు, మైహోం యాజమాన్యంపై వెంటనే కేసులు నమోదు చేయాలి.అక్రమ నిర్మాణాలను వెంటనే సీజ్ చేయాలి అని బహుజన్ సమాజ పార్టీ (బిఎస్పి) హుజూర్ నగర్ నియోజవర్గ అద్యక్షులు మంద రవి మరియు సూర్యాపేట జిల్లా బిఎస్పి ఇంచార్జ్ రాపోలు నవీన్ కుమార్ లు తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.అనంతరం బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ మై హోం సిమెంట్ ఫ్యాక్టరీ లో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఎందుకు స్పందించడం లేదు?

ఎలాంటి అనుమతులు లేకుండనే వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్ ప్లాంట్ పనులు ఎలా నిర్మిస్తారు?ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారికి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజీకవర్గ ఇంచార్జీ కొండమీది నర్సింహారావు,చింతలపాలెం మండల కన్వీనర్ సాలే గురుస్వామి,మట్టంపల్లి మండల మహిళా కన్వీనర్ ఎస్ డి నాగుల్ బీ తదితరులు పాల్గొన్నారు.