Monday, July 7, 2025
[t4b-ticker]

తరగతి గదులే నివాస గది!:సమస్యల సుడిగుండంలో గురుకుల విద్యార్థులు

:ప్రభుత్వ అలసత్వం వల్ల గురుకుల వ్యవస్థ అస్తవ్యస్తం.
:నరకయాతనలో గురుకుల విద్యార్థులు.
:కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం.
:ఎక్కడ చూసినా సమస్యల వలయం.
:విద్యార్థులుతో కలిసి భోజనం పరిశీలన చేసిన మేడి ప్రియదర్శిని.

నకిరేకల్,జులై 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రభుత్వ గురుకుల హాస్టళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కొరవడంతో గురుకుల హాస్టల్ సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు.బుధవారం నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఉన్న ప్రభుత్వ గురుకుల హాస్టల్ ని వారు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ హాస్టల్లో అడుగు అడుగున సమస్యలు తిష్ట వేశాయన్నారు.

ఏ హాస్టల్లో చూసినా వసుతుల కొరవడి,ప్రభుత్వం పర్యవేక్షణ లోపం వల్ల,గాడి తప్పిన నిర్వహణతో దైనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.రాత్రి వేళలో చలి వణికిస్తుండగా కనీసం దుప్పట్లు సైతం సరఫరా చేయని ప్రభుత్వం హాస్టల్ లో విద్యార్థులు గజగజలాడుతున్నారు.కనీసం క్లాస్ రూంలలో బెంచీలు లేక కింద కూర్చుని చదువుకోవాల్సిన దారుణమైన పరిస్థితి.హాస్టల్లో గదులు తలుపులు కిటికీలు సక్రమంగా లేకపోవడంతో,అంటు వ్యాధులు ప్రబలే ఈ వర్షాకాలం లో సరైన పారిశుధ్యం పాటించక పోవడం వల్ల దోమల బారి నుండి తమనుతాము కాపాడుకునే మార్గం కానరాక చిన్నారులను నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క రూమ్ లో 20 మంది ఉండగా వారికీ పడుకోవడానికి ప్లేస్ లేక తరగతి గదిలో పడుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.హాస్టలో వంట గది,పిల్లలు తినడానికి డైనింగ్ హాల్ లేక విద్యార్థులు బయట,అక్కడే నిల్చోని తినే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేకుల షెడ్ తో డైనింగ్ హాలు ఏర్పరచగా దాని పహరి గోడ కూలి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.ఆమె విద్యార్థులతో కలిసి భోజనం ను పరిశీలించారు.ప్రభుత్వం ప్రతి ఒక్క హాస్టల్ కు సన్న బియ్యం పంపిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ పంపిస్తున్నారో చుపియాలన్నారు,జావ లో పురుగులు ఈగలు వస్తున్నాయని పిల్లలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని అన్ని హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి అన్నారు.గురుకులాల కు రావల్సినటువంటి నిధులు ఏ దొంగల జేబుల్లోకి పోతున్నయో బీఅర్ఎస్ పార్టీకి ప్రతినిధి అయిన ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్,చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్,నార్కట్ పల్లి మండల కార్యదర్శి మేడి వాసుదేవ్,మండల కోశాధికారి పాల మహేష్,చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య బిఎస్పి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular