నల్గొండ జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)నకిరేకల్ నియోజక వర్గం: భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు.ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.శిధిలావస్థలో ఉన్న ఇండ్లను నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డ్రైనేజీ కాలువలు చెరువులు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకూడదని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకూడదని చెప్పారు.
అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వీలైనంత సహకారాలు అందించాలని ఆదేశించారు.బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.



