కోదాడ,ఆగష్టు 01(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ మంగళవారం తెల్లవారు జామున గుండె పోటు తో మరణించారు.ఆయన ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ (ఐలు) రాష్ట్ర సహాయ కార్యదర్శి గా పని చేస్తున్నారు.ఆయన మృతి పట్ల కోదాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఐలు సూర్యాపేట జిల్లా కన్వీనర్ వేజెళ్ళ రంగారావు తో పాటు పలువురు ఐలు సభ్యులు,సీనియర్,జూనియర్ న్యాయవాదులు ఒక నిమిషం మౌనం పాటించి తమ సంతాపం ప్రకటించారు. ఐలు కార్యదర్శి గా ఇస్మాయిల్ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడని అన్నారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పాలేటి నాగేశ్వర రావు,ఈదుల కృష్ణయ్య,షేక్ రంజాన్ బాషా,ముల్కా వెంకటరెడ్డి,గట్ల నరసింహా రావు,చల్లా కొండల్ రెడ్డి,ఉయ్యాల నర్సయ్య,బెల్లంకొండ గోవర్ధన్,జూనియర్ న్యాయవాదులు ఎస్ జే పాషా,కంచర్ల శరత్,కోదండపాణి,సామా నవీన్,దొడ్డ శ్రీధర్,చలం,హేమలత తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాది మృతి పట్ల సంతాపం
RELATED ARTICLES