కోదాడ,ఆగష్టు 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అనంతగిరి మండలం పరిధిలో ఉన్న అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగిన చోరీ కి సంబంధించి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ పోలీసు సిబ్బంది టెక్నికల్ టీం సిబ్బందితో కలిసి పరిశీలించారు.చోరీ జరిగిన విధానాన్ని దొంగ వచ్చిన మార్గాలను ఎస్పీ పరిశీలించారు,లాకర్ రూమ్ లను పరిశీలించారు.కళాశాల మేనేజ్మెంట్ను ప్రశ్నించి ఎవరిపై అనుమానాలు ఉన్నాయా,లాకర్ వివరాలు ఎవరెవరికి తెలుసు అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.సీసీటీవీ ఆధారాలు సేకరించాలని అన్ని మార్గాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని అదుపులోకి తీసుకోవాలని కోదాడ డీఎస్పీ ప్రకాష్ ను ఆదేశించారు.చోరీకి పాల్పడ్డ దొంగలను త్వరగా గుర్తిస్తామని,దొంగతనానికి గురైన సోత్తుని రికవరీ చేసి కేసును త్వరగా చేదిస్తామని అన్నారు.ఫింగర్ ప్రింట్స్,డాగ్ స్క్వాడ్స్,టెక్నికల్ టీమ్స్ చోరీ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఆధారాన్ని గుర్తించాలని,ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టి వద్దని ఆదేశించారు.అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డిఎస్పి ప్రకాష్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్,కోదాడ రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి,కోదాడ పట్టణ సిఐ రాము,అనంతగిరి ఎస్సై,టెక్నికల్ టీం,సిసిఎస్,డాగ్ స్క్వాడ్,క్లూస్ టీం,ఫింగర్ ప్రింట్స్ సిబ్బంది ఉన్నారు.
అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన చోరీ ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్
RELATED ARTICLES