Tuesday, July 8, 2025
[t4b-ticker]

నులి పురుగుల రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు

హుజూర్ నగర్,ఆగష్టు 03(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వయస్సు చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నులిపురుగు మాత్రలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరముల వయస్సు కలిగిన విద్యార్థినీ విద్యార్థులకు .‘’ఆరోగ్యవంతమైన పిల్లల కోసం అల్బెండజోల్ మాత్రలు వేయించండి’’ అనే నినాదంతో మాత్రలు వేసుకోవాలి అని అన్నారు.ఈ టాబ్లెట్ మింగుటం వలన పిల్లల చిన్న ప్రేగులో ఉన్న నులిపురుగులు నట్టలు చనిపోతాయని కావున ప్రతి ఒక్కరూ మాత్రలు మింగడం అవసరం అని అన్నారు.కడుపులో నట్టలు కలిగి ఉన్న పిల్లలు పోషకాహార లోపం,రక్తహీనతలతో ఎప్పుడూ అలసటగా ఉంటారని మరియు శారీరక పెరుగుదల, మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉంటారని అన్నారు.పిల్లలకు నులి పురుగులు రాకుండా సులభంగా నియంత్రించవచ్చని,పరిసరాల పరిశుభ్రత,బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయకుండా,ఎల్లప్పుడూ మరుగుదొడ్డిని ఉపయోగించడం వలన,చేతులను ముఖ్యంగా భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత శుభ్రంగా కడుక్కొనుట వలన,పండ్లు మరియు కూరగాయలు శుభ్రమైన నీటితో కడుగుట వలన,ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే త్రాగుట మరియు ఆహారము ఆహార పదార్ధములను కప్పి ఉంచుట వలన,గోర్లు శుభ్రంగాను చిన్నవిగాను ఉంచుకొనుటవలన,కాళ్లకు ఎల్లప్పుడూ చెప్పులు ధరించుట వలన నట్టల నివారణను నియంత్రించవచ్చని తెలిపారు.నులిపురుగుల రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రశాంత్,డాక్టర్ సన,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లెల ఉదయ్ శ్రీ,,సిహెచ్ఓ పద్మ,సిహెచ్ఎన్ నూర్జహాన్,హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ,ఉపాధ్యాయులు శ్రీనివాస్,శ్రీనివాసరెడ్డి,మాతంగి ప్రభాకర్ రావు,ఉపేందర్,దీనారాణి,అరుణ రాణి,శేషగిరి,అన్వేష్, వసంతరావు,అశోక్ కుమార్,రవీందర్ రెడ్డి,జానీ బేగం,శేఖర్,మున్ని,నాగేశ్వరరావు,శ్రీకాంత్,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular