కోదాడ,ఆగష్టు 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతాది అనే ఉద్దేశంతో యువత తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొని ఎంతోమంది ఆత్మబడెదనాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఊహించిన విధంగా అభివృద్ధి జరగలేదు అని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు. శనివారం మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమం చిలుకూరు మండల పరిధిలోని జానకి నగర్ తండ,దూదియాతండ,శీతలతండ,నారాయణపురం,సీతారాంపురం,చిలుకూరు గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన తండాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటికొక ఉద్యోగం వస్తదని ఎంతో ఆశతో ఉన్న యువతకు ఉద్యోగాలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అందువలన గ్రామాలలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని అన్నారు. గ్రామాలలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా వెళ్తున్నారని ప్రజలు వాపోతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,మట్టయ్య యాదవ్,రవి,కోటయ్య,రాముడు,శివ,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,నవీన్,కతిమాల వెంకన్న,చంద్రకళ,గౌతమి,కళావతి మాలోవత్ బాలు,అయ్యప్ప, అప్పారావు,ఎలుగూరి సైదులు గౌడ్ బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,చిన్న బుజ్జి,స్రవంతి,బాలి లక్ష్మి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.