సూర్యాపేట,ఆగష్టు09(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:”ఉమ్మడి పౌరస్మృతి – మణిపూర్ పరిణామాలు- బిజెపి ప్రభుత్వ విధానాలు”అనే అంశంపై ఆగస్టు 12 మధ్యాహ్నం 2:00 కు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగే సెమినార్ ను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో నిర్వహించిన జిల్లా సిపిఎం పార్టీ,ప్రజా సంఘాల బాధ్యులసంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూఒకే దేశం,ఒకే చట్టం,ఒకే న్యాయం,ఒకే పాలసీ,ఒకే మతం అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దోపిడి,వివక్ష,ఉన్మాదంతో కుట్రలు చేస్తుందన్నారు. సోదర భావంతో మెరుగుతున్న ప్రజల మధ్య ఉమ్మడి పౌరస్మృతి పేరుతో చీలికలు తెచ్చే కుతంత్రాలకు ఉనుకుంటుందని విమర్శించారు.75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో నేటికీ ఆర్థిక అసమానతలు అంతరించలేదన్నారు.నేటికీ సామాజిక వివక్ష తొలగ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్ఎస్ఎస్,బిజెపి దేశంలో ఏకరూపం సాధించాలని 21వ లా కమిషన్ నియమిస్తే దేశం యొక్క ఐక్యత సమగ్రతలు కాపాడాలంటే ఇప్పుడు పౌరస్మృతి అవసరం లేదని లా కమిషన్ సిఫారసు చేసిందన్నారు.భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తితో ఉన్న ఈ దేశంలో ఎన్నో మతాలు,జాతులు,సాంస్కృతులు, సాంప్రదాయాలు,భాషలు,ఆచార వ్యవహారాలు ఉన్న ఈ దేశంలో కుల,మత ఘర్షణలకు తావు లేదన్నారు. లౌకిక శ్రేయో రాజ్యంలో ఎన్నికల సమయంలో ఈ పౌరస్మృతి చట్టాన్ని ముందుకు తెచ్చి ప్రజల మధ్య మత విద్వేషాలను పెంచి బడుగు, బలహీన వర్గాల, దళిత, గిరిజనులను దోపిడీ చేసి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే దురుద్దేశం తో బిజెపి చేస్తుందన్నారు.ఇటీవల మణిపూర్ లో జరిగిన గిరిజన మహిళల వివస్త్రణ,గిరిజనుల ఊచకోత, హర్యానాలో మైనార్టీలపై దాడులు మనుధర్మంలో భాగమేనని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకుందన్నారు. ఆర్ఎస్ఎస్, బిజెపి అనుసరిస్తున్న ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ వ్యతిరేక విధానాలను మతోన్మాద చర్యలను ప్రజలంతా తిప్పి కొట్టాలని కోరారు. ఈనెల 22న జరిగే సెమినార్ కు ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ లు, ప్రజాస్వామిక లౌకికవాదులు, మేధావులు, విద్యార్థి, యువజనలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సెమినార్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి,మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, జిల్లా ప్రజాసంఘాల నాయకులు ఎల్గూరి గోవింద్,జిల్లపల్లి నరసింహారావు,ఎం.రాంబాబు కొప్పుల రజిత,మేకన బోయిన సైదమ్మ,కాసాని కిషోర్, మేకన బోయిన శేఖర్,చందా చంద్రయ్య,కందాల శంకర్ రెడ్డి,షేక్ జహంగీర్,చినపంగు నరసయ్య,ఎం వెంకట్ రెడ్డి,ఎం వెంకన్న,అర్వపల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి- మణిపూర్ పరిణామాలు- బిజెపి విధానాలు అనే అంశంపై ఆగస్టు 12న జరిగే సెమినార్ ను జయప్రదం చేయండి:సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
RELATED ARTICLES