కోదాడ,ఆగష్టు 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో క్రిస్టియన్ మిషనరీ సంఘసంస్కర్త డాక్టర్ విలియం కేరి 262వ జన్మదిన మహోత్సవాన్ని రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య పాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.డాక్టర్ విలియం కేరి యవ్వనప్రాయంలో ఇంగ్లాండ్ దేశం నుండి క్రైస్తవ మిషనరీ గా ఇండియాలోఅడుగుపెట్టి ఇండియాలోని 42 భాషలను నేర్చుకుని 40 భాషల్లో బైబిల్ ను తర్జుమా చేసి అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మహా జ్ఞాని దైవదూత విలియం కేరి అని అంతేకాకుండా సతీసహగమనం నిర్మూలన కొరకు డాక్టర్ రాజా రామ్ మోహన్రాయ్ తో కలిసి పనిచేశారు,ఆడపిల్లల స్కూలు స్థాపించి వారికి చదువు ఉండాలని స్కూలులను స్థాపించారు పెన్నులు మొదలగు వాటిని కనుగొని దేశానికి పరిచయం చేశారు.ఇంతటి మహోన్నతమైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం క్రైస్తవులు అదృష్టం అని కొనియాడారు.ఇప్పటికీ శిరంపూర్ లో విలియకేరి స్థాపించిన స్కూలు కళాశాలలో ఎన్నో నిదర్శనంగా మన కనబడుతున్నాయని అన్నారు. నేటి తరానికి వారి రచనలు వారి సమయస్ఫూర్తి సామాజిక సేవ ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యులు వంటేపాక జానకి ఏసయ్య,పాల్ చారి,చిలుకూరు అబ్రహం,ప్రభుదాస్,రిటైర్డ్ టీచర్ సుందర్ రావు,కిరణ్,సునీత,మేరా బి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ విలియం కేరి 262 వ జన్మదిన మహోత్సవం:నేటి తరానికి ఆదర్శప్రాయుడు విలియం కేరి- రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య పాస్టర్
RELATED ARTICLES



