కోదాడ,ఆగష్టు 18మనం న్యూస్:పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తా వద్ద
పాపన్న గౌడ్ 373 వ జయంతిని శుక్రవారం విగ్రహ కమిటీ అధ్యక్షులు కారంగుల అంజన్ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంజన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసి,దక్కన్ రాజ్యంపై డిల్లీ పెత్తనాన్ని ధిక్కరించి గోల్కొండ ఖిల్లాపై స్వతంత్ర బావుటా ఎగరవేసి 8 నెలల కాలం పరిపాలించిన బహజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పుట్టుక సాధరణ మైనా ఆయన జీవించిన కాలం అసాధరణమైన వ్యక్తి గా కాకుండా బహుజన శక్తిగా ఎదిగిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ సామాన్య కల్లు గీత కుటుంబంలో జన్మించి మొదట్లో కుల వ్రృత్తి గీత వృత్తినే స్వీకరించారు.కాని 17 వ శతాబ్దంలో మొగల్ భూస్వామ్య,పెత్తందార్ల పునాదులు ప్రజలను పీడిస్తున్నాయి.ఈ పరాయి పాలనలో బానిసలుగా బతకడం కంటే స్వయం పాలన చేసుకుందాం అని పాపన్న ఆలోచన చేశాడు.గీత వ్రృత్తిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి.అనేక కులాలను సమన్వయం చేయడమే కల్లు గీత వ్రృత్తి లక్షణం అనుకున్నాడు. మొగలు రాజరికపు పునాదుల్లో సామ్యవాదాన్ని స్థాపించటమే లక్ష్యంగా ప్రకటించుకున్నాడు.కల్లు గీత కత్తి పట్టిన చేతులు రాజ్యాదికార ఆయుధాన్ని ధరించి కులం,మతం,వర్గ బేధం లేని అనేక మందితో సైన్యాన్ని తయారుచేసి మొగలు రాజరికపు పునాదులు కదిలించాడు పాపన్న గౌడ్.భూస్వాములను,పెత్తందార్ల ను ఎదురించి అణగారిన వర్గాల ప్రజలను సైనికులుగా తయారు చేసుకుని స్థానికంగా కోటలను తాటికొండ,ఖిలాషాపురం వేముల కొండ, భువనగిరి,సర్వాయిపేట వరంగల్ లాంటి ప్రాంతాల్లో కోటలు నిర్మాణం చేసుకుంటు మొత్తం 33కోటలను నిర్మించి 12 వేల మంది సైన్యం తో మొగలు సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించి స్వయం పాలన జెండా ఎగురవేసాడు.ఈ కార్యక్రమంలో చిలుకూరు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొండ సైదయ్య గౌడ్,కోదాడ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాసాని శ్రీనివాస్ గౌడ్ (వెంకటేశ్వర్లు),ఒకటో వార్డ్ కౌన్సిలర్ అలవాల అపర్ణ,వెంకట్ గౌడ్,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సంపేట ఉపేంద్ర గౌడ్,నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్ గౌడ్,న్యాయవాది ఉయ్యాల నరసయ్య,పుట్టా వెంకటేష్ గౌడ్,గాలి శ్రీనివాస్ గౌడ్,పోలంపల్లి ఎల్లగౌడ్,బాలెబోయిన శ్రీనివాస్,బండి శ్రీను,మేకపోతుల సత్యనారాయణ గౌడ్,అనంతుల మహేష్ గౌడ్,సంపెట నరేష్ గౌడ్
గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
దక్షిణ భారతదేశపు మొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.:గౌడ కులంలో పుట్టి రాజ్యాధికారం చేపట్టిన మహానీయుడు.:గోల్కొండ నవాబును ఎదిరించి పోరాడిన మహోన్నతమైన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
RELATED ARTICLES



