హుజూర్ నగర్,ఆగష్టు 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రము మరియు బూరుగడ్డ గ్రామం లో బహుజన యుద్ద వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 373 వ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎస్పి రాష్ట్ర నాయకులు కొండ భీమయ్యగౌడ్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు రాచరికం ఎవరు సొత్తు కాదని 16 వ శతాబ్దంలో నే తెలంగాణ గడ్డపై పోరు విత్తనాలు నాటిన విప్లవ కారుడని,గీత వృత్తి తోనే తృప్తి చెందక బహుజన సమాజానికి సేవ చేయాలనే కాంక్షతో కల్లు గీస్తే ఏమోస్తది కొడితే గోల్కొండ రాజును కొట్టాలి రాజు పై రాజ్యమేలాలని పన్నెండు మంది సైన్యంతో మోఘల్ సైన్యాన్ని ఓడించి ఏడున్నర నెలల పాటు ఆత్మ గౌరవంగా గోల్కొండ రాజ్యాన్ని ఏలిన తొలి బహుజన చక్రవర్తి పాపన్న గౌడ్ అని తెలంగాణ లో బహుజన రాజ్యము రావాలంటే బహుజనులు ఏకతాటిపైకి రావాలని తెలంగాణ రాష్ట్రం లో బహుజన రాజ్యాన్ని స్థాపించే దిశగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ చట్ట సభలలో అరవై నుంచి డెబ్బై అసెంబ్లీ సీట్లు బి.సిలకే కేటాయిస్తున్నారని ఆ దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిసి,యస్సీ,యస్టీ,మైనారిటీ,అగ్రవర్ణాల నిరుపేదలు ఐక్యత తో ఉండి ఎన్నికల్లో బహుజన రాజ్యాన్ని స్థాపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్రీనివాస్ యాదవ్,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బుడిగే మల్లేష్ యాదవ్,సూర్యాపేట జిల్లా మహిళా కో కన్వీనర్ వెంపటి నాగమణి,హుజూర్ నగర్ అసెంబ్లీ ఇంచార్జీ బొల్లగాని సబ్బుగౌడ్,హుజూర్ నగర్ అసెంబ్లీ ఇంచార్జీ కొండమీది నర్సింహారావు,అసెంబ్లీ అధ్యక్షులు మంద రవి,అసెంబ్లీ మహిళా కో కన్వీనర్ కట్టెబోయిన సునీత యాదవ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నందిగామ గోవింద్,బిట్ సెల్ నియోజికవర్గ కన్వీనర్ గండమల్ల వీరాంజనేయులు,ఆదూరి విజయ్,మేళ్ళచెరువు బిఎస్పి నాయకులు యాంపంగు రవి,ఏర్పుల చందు,చిన్నపంగు రఘు,తేళ్ల గంగారావు,ఎరగాని వినయ్ తదితరులు పాల్గొన్నారు.
బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్నగౌడ్:కొండా భీమయ్య గౌడ్బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు
RELATED ARTICLES



