కోదాడ,ఆగష్టు 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని బండపాలెము లో స్వయంభువుగాను,స్వయంవ్యక్తముగాను వెలసియున్న శ్రీదేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అతి ప్రాచీనముగా వెలసియుండి,భక్తులపూజలందుకొని,వారి కోరికల నిట్టే నెరవేర్చే దేవాలయ క్షేత్రపాలకుడైన శ్రీ వీర దాసాంజనేయ స్వామి వారికి తేది. 22/08/2023,మంగళవారము నాడు ఉదయం8గంటల30నిమిషాలకు పంచామృత అభిషేకము,అష్టోత్తర, సహస్రనమాలతో తములపాకు పూజ జరుపబడును.సకల పాపహరుడు( నరఘోష, నరపీడ, నరదృష్టి )దోషనివారకుడు ఐన ఆంజనేయుని పూజలో ఆసక్తి,భక్తి గలవారెల్లరు యథాశక్తి పూలు, ఆవుపాలు,ఆవుపెరుగు, ఆవునెయ్యి,తేనె,

పంచదార,తములపాకులు,అరటిపండ్లు,పెసరపప్పు మొదలైన పూజాసామగ్రి తీసికొని వచ్చి హనుమంతుని పూజలో పాల్గొన్నట్లయితే సంతానం లేని వారికి సంతానం ఇతర దేశాలకు వెళ్లే వారికి వీసా ఎప్పటినుంటున్న సమస్యలు కోరుకున్న ప్రతి ఒక్కరికి కోర్కెలు తీరతాయని కావున ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తరింతురుగాక! అదే రోజు మన శ్రీవేంకటేశ్వర స్వామికి స్వాతి నక్షత్రపూర్వక శ్రీలక్ష్మీ నరసింహాష్టత్తర నామావళితో పూజ కూడఉండును.కావున భక్తమహాశయులు సద్వినియోగము చేసికొనగలరు.పూర్తి వివరాలకు అర్చకులు ముడుంబై వేణుగోపాలాచార్యులు-95530 93569,సహాయకులు ముడుంబై లక్ష్మణాచార్యులు.9948174127.



