హుజూర్ నగర్,ఆగష్టు 23 (mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:దాతల సహకారంతో విద్యార్థులకు అందిస్తున్న మెటీరియల్ ని సద్వినియోగం చేసుకొని మెరిట్ స్కాలర్షిప్ ని సాధించాలని ఎలక్ట్రికల్ డిఈ నిమ్మల వెంకట కృష్ణయ్య అన్నారు.మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ మీన్స్ కం మెరిట్ కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్) మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎలక్ట్రికల్ డిఈ నిమ్మల వెంకట కృష్ణయ్య పాల్గొని విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్యామ్ పాల్ రెడ్డి,శాంతి రెడ్డి లు ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు చేయూతనిచ్చి ఉన్నత స్థాయికి ఎదిగేటట్లు సహాయపడడం అభినందనీయమని అన్నారు.విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.అనంతరం ఫౌండేషన్ చైర్మన్ పల్ రెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ పేద పిల్లలకు ఎలాంటి సహాయమైనా మా ఫౌండేషన్ అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ పల్ రెడ్డి నరసింహారెడ్డి,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మామిళ్ళ శ్రీనివాసరెడ్డి,టి శ్రీనివాస్,అత్తి వెంకటేశ్వర్లు,ఆర్ శ్రీనివాస్,మాతంగి ప్రభాకర్ రావు,వి శ్రీనివాస్,రజిత,శౌరి రెడ్డి,షబానా,ఉస్మాన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష మెటీరియల్ ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి:డిఈ వెంకట కృష్ణయ్య
RELATED ARTICLES



