కోదాడ,ఆగష్టు 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:శుక్రవారం గాంధీభవన్ లో ఏఐసిసి ఎలక్షన్ కమిటీకి కోదాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న డా,, అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జూడో యాత్ర చేసినాడు ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులకు,యువతకు,బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పడం జరిగిందని అన్నారు.దీనిని దృష్టిలో పెట్టుకొని కోదాడ కాంగ్రెస్ టికెట్ ఒక యువకుడిగా,విద్యావంతుడిగా,మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిగా,ఓయూ జేఏసీ అధ్యక్షులుగా,తెలంగాణ బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న నాకు కోదాడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని అన్నారు.కోదాడ నియోజకవర్గంలో 2018 సాధారణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కొన్ని జాతీయ పార్టీలకు దీటుగా మూడో స్థానంలో ప్రజలు నన్ను ఆదరించరని అన్నారు.అప్పటి నుండి ఇప్పటివరకు కోదాడ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ అవినీతిని ఎండ కడుతూ నిరుపేదలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నిర్వహించిన మన ఊరుకు మన గడపకు మన అంజన్న కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో 42 రోజులు పర్యటించి ప్రజాభిమానాన్ని చోరగొన్నానని అన్నారు.ఈ యాత్రలో ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారని యువనాయకత్వానికి,ఉద్యమకారుడికి ఒక అవకాశం కల్పిస్తారని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల మద్దతు ఉందని కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే గెలిచి తీరుతానని డా,, అంజి యాదవ్ అన్నారు.
ఏఐసీసీ ఎలక్షన్ కమిటీకి కోదాడ నియోజకవర్గం నుండి దరఖాస్తు చేసుకున్న డాక్టర్ అంజి యాదవ్
RELATED ARTICLES



