హైదరాబాద్,ఆగష్టు 26(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్రంలో అంగన్‌వాడీ సిబ్బందికి ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్‌వాడీ టీచర్‌కు ప్రత్యేక ఆర్ధిక సహాయం కింద రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లకు రూ.50 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు అంగన్‌వాడీ సిబ్బంది ఉద్యోగ విరమణ ప్రోత్సాహకాల దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఉద్యోగ విరమణ తరువాత సిబ్బందికి ఆసరా పింఛన్‌ను ప్రభుత్వం మంజూరు చేయనుందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందికి దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లకు పదవీ విరమణ ప్రోత్సాహకాలు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లాభారతి, విలాసకవి నిర్మల ధన్యవాదాలు తెలిపారు.
అంగన్‌వాడీ సిబ్బందికి ఉద్యోగ విరమణ ప్రోత్సాహకాలు
RELATED ARTICLES



