కోదాడ,ఆగష్టు 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మంగళవారం నాడు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆర్ వెంకట్రావు గారికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయని వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో డీఎస్సీ నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,089 పోస్టులకు డీఎస్సీ వేస్తామని ప్రకటించడం సరికాదన్నారు.పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలన్నారు.అన్ని పాఠశాలల్లో ఉపాద్యాయుల కొరత లేకుండా చూడలన్నారు.వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ డివైఎఫ్ఐ నాయకులు జై నరసింహ రావు, జిల్లా నాయకులు షేక్ జహంగీర్ గడ్డం వినోద్ తదిరులు పాల్గొన్నారు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి.:డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం.
RELATED ARTICLES



