కోదాడ,ఆగష్టు 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయించడం ఆ ప్రజాస్వామ్యమని కోదాడ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఇన్చార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ను బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి నాన ఇబ్బందులకు గురిచేస్తుంది దానికి నిరసనగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు సూర్యపేటలో బుధవారం మహాధర్నాను ఏర్పాటు చేసినారు.ఈ ధర్నాకు బిఎస్పీ నాయకులు వెళ్లకుండా ఉదయం నాలుగు గంటలకు పిల్లుట్ల శ్రీనివాస్ నివాసంలో ముందస్తు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాధర్నా విజయవంతం అయితే బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని ఈ ధర్నాను చెడగొట్టాలనే ఉద్దేశంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆయన అన్నారు.అధికార పార్టీ ధర్నాలు చేస్తే తప్పులేదు కానీ మేము చేస్తే ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో నెమ్మాది సురేష్,చంటి తదితరులు లను స్టేషన్ కు తరలించారు.
ముందస్తు అరెస్టులు అ ప్రజాస్వామికం:పిల్లుట్ల శ్రీనివాస్
RELATED ARTICLES



