తుంగతుర్తి,సెప్టెంబర్ 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:విద్యార్థులు చదువుతోపాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫౌండేషన్ అధ్యక్షులు. న్యాయవాది యం డీ ఖాలేద్ అహ్మద్ మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్యలు అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో ఇండియన్ నేషనల్ ఆర్మీ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నాడు దేశ స్వాతంత్రం కోసం ఎందరో వీరులు అమరులయ్యారని అన్నారు. బ్రిటిష్ కబంధ హస్తాల నుండి భారతదేశాని విముక్తి చేయడం కోసం ఆనాడే 1942 సెప్టెంబర్ 1న ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పడి బ్రిటిష్ వారితో పోరాటం చేసిందని అన్నారు. దేశం కానీ దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వీరోచితంగా దేశం కోసం పోరాటం చేసి విమాన ప్రమాదంలో అమరుడు అయ్యాడని అన్నారు.

దేశం కోసం ఇటీవల కల్నల్ సంతోష్ బాబు దేశ సరిహద్దుల చైనా సైన్యంతో పోరాడి అమరుడయ్యాడని అన్నారు. దేశం కోసం వారిచ్చిన స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకొని దేశ సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రయత్నం చేస్తూ ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదన్నారు విద్యార్థులు కష్టపడి చదివి ఒక శాస్త్రవేత్తతో. ఒక ఇంజనీరు గా. సైనికుడిగా. ఒక డాక్టర్ గా తయారయ్యి దేశం తరఫున దేశ సేవ చేసేందుకు ముందుండాలని అన్నారు. విద్యార్థులు చదువును ఇష్టపడి కష్టపడి చదివితే ప్రయోజకులుగా మారుతారని అన్నారు. సందర్భంగా విద్యార్థులకు దేశభక్తిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మైనారిటీ నాయకులు ఎండి నసీరుద్దీన్ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు నసీర్. అధ్యాపకులు అబ్దుల్ ముజీబ్. నసిర్. ఫిరోజ్ ఖాన్. బాలా సాహెబ్ తో పాటు పలువురు పాల్గొన్నారు



