కోదాడ,సెప్టెంబర్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఖరీఫ్ లో సాగు అవసరాలకు కావాల్సినంత యూరియాను కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.శనివారం విలేఖరులతో మాట్లాడుతూ పంటల సాగు విస్తీర్ణంపై ప్రభుత్వం ముందస్తుగా సరైన అంచనాలను, ప్రణాళికలను రూపొందించక పోవడం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా యూరియాను సరఫరా చేసి ఉంటే రైతులు పనులు మానుకొని దుకాణాల ముందు పడిగాపులు కాయల్సిన దుస్థితి పట్టేది కాదన్నారు.సొసైటీలల్లో లాగా ఫర్టిలైజర్ షాపులల్లో కూడా యూరియాను ఎమ్మార్పి ధరకే అమ్మేలా వ్యవసాయ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.యూరియాను వెంటనే సరఫరా చేసి,ఎమ్మార్పి రేటుకు అమ్మేలా తగు చర్యలు తీసుకోకపోతే రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
యూరియా కొరతను నివారించాలి
RELATED ARTICLES



