గురుపుజోత్సవం సందర్బంగా ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ,సెప్టెంబర్ 05(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తల్లిదండ్రులు జన్మనిస్తే,గురువులు జీవితాన్నిస్తారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.మంగళవారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని సిసి రెడ్డి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ,చింత చంద్రారెడ్డి దంపతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో గురువులపాత్ర ఉన్నతమైనదని గురువులపై ప్రతి విద్యార్థి అంకితభావంతో ఉండాలని సూచించారు.చదువు చెప్పే వారు మాత్రమే గురువులు కాదని,సన్మార్గంలో నడిపించే ప్రతిఒక్కరూ గురువులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని అన్నారు.విద్యార్థులు సమాజంలో ఉన్నతస్థాయిలో రాణించడానికి తల్లిదండ్రుల కృషి ఎంత ఉంటుందో గురువుల కృషి కూడా అంతే ఉంటుందని ఆయన తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు,ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల సంక్షేమానికి,అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తున్నదని ఆయన తెలిపారు.గురుకుల విద్యలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని,నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉందని తెలిపారు.గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని ఆయన తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ,క్రీడల్లోనూ జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని ఆయన అన్నారు.విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న అంకితభావానికి,చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి,మండల విద్యాశాఖ అధికారి సలీం షరీఫ్,ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయ సంఘం నాయకులు,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిధులు,కౌన్సిలర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



