కామారెడ్డి,సెప్టెంబర్ 08(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కామారెడ్డి నిజాంబాద్ జిల్లాల్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో 25 లక్షలతో నిర్మించే జగదాంబ సేవాలాల్ మందిరం మరియు పోతంగల్ మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో నిర్మించే హనుమాన్ మందిరం నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
అనంతరం రూ. 15 లక్షలతో నిర్మించిన పోతంగల్ హనుమాన్ మందిర్ కమ్యునిటీ హాల్ ను సభాపతి ప్రారంభించారు.
సందర్భంగా పోతంగల్ గ్రామంలో సభాపతి పోచారం మాట్లాడుతూ..
ఆలయ నిర్మాణాలు భక్తి కి సంకేతాలు.నోటి మాటతో కాకుండా హృదయం నుండి వచ్చేది నిజమైన భక్తి, దానిని దేవుడు కూడా చల్లగా ఆశీర్వదిస్తాడు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నుండి బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాలు, మజీద్ లు, దర్గాలు, చర్చిల నిర్మాణానికి రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేశాను అని వెల్లడించారు.ఈ కార్యక్రమాలలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ వర్ని శంకర్,ప్రజా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు..



