కోదాడ,సెప్టెంబర్ 10 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.అక్కడి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.వార్డులో ప్రధానంగా సిసి రోడ్లు,డ్రైనేజీలు,విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పడంతో వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి వార్డు లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.అనంతరం వారు మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించగా అందులో విడుదలైన 20 కోట్లతో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.గత ప్రభుత్వాల పాలనలో కోదాడ పట్టణంలో త్రాగునీటి కోసం ట్యాంకర్ల కొరకు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి ఉండేదని నేడు మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగనీరు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మభ్య పెట్టడానికి పార్టీల జండాలతో ఓట్ల కోసం వస్తారని మాయమాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు.ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు.అనంతరం స్థానికులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి గజములతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు పత్తిపాక జనార్దన్ వర్మ,గ్రంథాలయ చైర్మన్ షేక్.రహీం,కౌన్సిలర్ ఖాదీర్ పాష,అప్పారావు,వంటి పులి శ్రీను,తిప్పని పురుషోత్తం,సతీష్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,సూర్య,సుధాకర్,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ సమస్యలను పరిష్కరిస్తా:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES



