కోదాడ,సెప్టెంబర్ 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నిత్యం క్రీడల సాధన తో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ కళాశాల మైదానంలో కోదాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టీచర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగా అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక మండలాల్లో క్రీడా ప్రాంగణాలు మీని స్టేడియంలో నిర్మించామన్నారు.ప్రతి పాఠశాలకు క్రీడల సామాగ్రి కొనుగోలుకు వేలాది రూపాయల నిధులు కేటాయించిన మన్నారు.స్కూల్ గేమ్స్,మండల గేమ్స్,కళాశాల స్థాయి గేమ్స్ నిర్వహిస్తూ ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేసి వారిలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.ప్రస్తుత ప్రజలు సామాజిక మాధ్యమాలతో కాలం గడుపుతూ శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని,క్రీడలు మేధస్సుకు విజ్ఞానం పెంపుదలకు క్రీడల సాధన ఎంతో ఆవశ్యకమన్నారు.కోదాడలో క్రికెట్ క్రీడా అభివృద్ధికి కోదాడ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.వృత్తిపరంగా ఒత్తళ్లతో ఉన్న వారికి క్రీడలు ఎంతో మేలు చేస్తా అన్నారు.క్రికెట్ క్రీడ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని కోరారు.ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్,ప్రీమియర్ లీగ్ కెప్టెన్ కెప్టెన్ కోదాడ క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకులు షేక్ సిద్దిక్ లు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఎమ్మెల్యే బ్యాటింగ్ బౌలింగ్ చేసి క్రీడాకారులను హుషారు ఎత్తించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్,కోదాడ క్రికెట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గయ్య,కన్వీనర్ చందా శ్రీనివాసరావు,ప్రెస్ పబ్లిసిటీ ఇంచార్జ్ బడుగుల సైదులు,సభ్యులు తీగల నరేష్,నాగేశ్వరరావు,డి లక్ష్మీనారాయణ,ఖాజా,సురేష్,అంకిరెడ్డి,జబ్బార్,పట్టణ కౌన్సిలర్లు కదిర్ పాషా,ఒంటి పులి రమా శ్రీనివాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
టీచర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES



