కోదాడ,సెప్టెంబర్ 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణలో భాగంగా.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓర్సు వేలంగి రాజు కోదాడ నుంచి అసెంబ్లీ స్థానానికి బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దరఖాస్తు దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఎవరు లేరని ఇక నైనా వడ్డెర కులానికి సంబధించి నాకు కోదాడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి పార్టీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు.కోదాడలో బిజెపి పార్టీ బలోపేతం కోసం తను అహర్నిశలు ఎంతో కృషి చేశానని జైలుకు కూడా పోయానని తన ఆస్తులను కూడా ధ్వంసం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ,మునగాల పార్టీ అధ్యక్షులు బి కృష్ణ ప్రసాద్,డి సత్యనారాయణ,దున్న సతీష్,శ్రీనివాస నాయక్,చల్ల వెంకట క్రిష్ణ,గాథరి పుల్లారావు,బేతు శ్రీ రామ్,టీ మధు సూధన్ తదితరులు పాల్గొన్నారు.
కోదాడ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దరఖాస్తు దాఖలు చేసిన ఓర్సు వేలంగి రాజు
RELATED ARTICLES



