కోదాడ,సెప్టెంబర్ 10(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 18 వ తేదీ నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ కోదాడ నియోజకవర్గ కేంద్రం తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి అధ్వర్యంలో 2 వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఎంఎస్పి కోదాడ మండల నాయకులు ఓగ్గు ఏసోబు మాదిగ,
ఎమ్మార్పీఎస్ పట్టణ ఇన్చార్జి ఏపూరి సత్యరాజు మాదిగ లు ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లేని కారణంగా మాదిగలకు ఉప కులాలకు రీజర్వేషన్లలో దక్కవలసిన న్య్యాయమైన వాట రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగలకు ఉప కులాలకు భవిష్యత్తు ఉంటదని వారు తెలిపారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ 9 సం నడుస్తున్న మాట నిలబెట్టుకోలేదని డిమాండ్ చేశారు.తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగల చిరకాల స్వప్నం అయిన ఎస్సీ వర్గీకరణకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించి న్యాయం చేయాలని తెలిపారు.లేని యెడల తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ నాయకులను మాదిగ పల్లెల్లో అడుగడునా అడ్డుకుంటామని తెలియజేస్తూ రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి రాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ చిమిర్యాల గ్రామ శాఖ అధ్యక్షులు కొండ సూర్యం,ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు తోళ్ళ సురేష్,ఏపూరి కళ్యాణ్,ఏపూరి క్రాంతి,యడ్ల లక్ష్మీనారాయణ,దొండపాటి సాయి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ చెయ్యక పోతే బీజేపీ ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం
RELATED ARTICLES



