హుజూర్ నగర్ సెప్టెంబర్ 19 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:హుజూర్ నగర్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ (BSP )నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి ఆధ్వర్యంలో బూరుగడ్డ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన బత్తిని సైదులు గౌడ్ ని పార్టీలోకి ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దేశగాని సాంబశివ గౌడ్ పాల్గొని బత్తిని సైదులు గౌడ్ కి డిఎస్పి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారిని బూరుగడ్డ గ్రామ శాఖ అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది.ఈరోజు నుంచి బిఎస్పి ఆర్ఎస్పి త్యాగాలను అన్ని సామాజిక వర్గాల వారికి తెలుపుతూ బిఎస్పీలో పాలుపంచుకోవడానికి ఏనుగు గుర్తును గడపగడపకు ప్రచారం,పరిచయం చేయడానికి పూర్తి బాధ్యతలను అప్పజెప్పడం జరిగిందని సాంబశివ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మహిళా కన్వీనర్ వెంపటి నాగమణి,హుజూర్ నగర్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ యరగాని వినయ్ గౌడ్,వెంపటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎస్పి ఉద్యమాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు:దేశ గాని సాంబశివ గౌడ్
RELATED ARTICLES



