*పౌర హక్కుల నేత మృతి*
సూర్యాపేట జిల్లా :సెప్టెంబర్ 22(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)
పౌర హక్కుల సంఘం నాయకుడు, కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ తొలి ఇంఛార్జి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వక్కంతుల విజయ్ కుమార్ (59) అనారోగ్య కారణాలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ శుక్రవారం ఆసుపత్రిలో విజయ్ స్మృతికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
విజయ్ విద్యార్థి దశలోనే PDSU సభ్యునిగా ప్రగతిశీల ఉద్యమాల్లో, మలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. విజయ్ ఆకస్మిక మరణం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.
నిమ్స్ లో విజయ్ భౌతికకాయానికి సీపీఐ ఎం.ఎల్. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం, ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వక్కంతుల కోటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిత, ప్రముఖ కవి సుధాకర్, ‘తెర’ సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, అధ్యాపకుడు వేముల వెంకటేశ్వర్లుతో పాటు సోషల్ మీడియా వేదికగా పార్టీలకు అతీతంగా పలువురు విజయ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు..