Thursday, December 25, 2025
[t4b-ticker]

వీర నారి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ,సెప్టెంబర్ 26(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన చాకలి ఐలమ్మ చరిత్రలో చిరస్మరణీయం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్ల యాదవ్ అన్నారు.మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ 124వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రజాకారులో పెత్తందారుల బానిసత్వాన్ని వెట్టి చాకిరి నుంచి ప్రజలను విముక్తి చేయడానికి జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి చాకలి ఐలమ్మ అన్నారు.చాకలి ఐలమ్మ పోరాట చరిత్ర చాకలి ఐలమ్మ తెగువ భవిష్యత్ తరాలకు పదిలంగా ఉండేందుకు పాఠ్యాంశాలలో ఆమె చరిత్రతో పాటు చాకలి ఐలమ్మ విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.చాకలి ఐలమ్మ ఆశయాలను సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సట్టు నాగేశ్వరరావు,తిరుమలగిరి రాధాకృష్ణ బీసీ సంఘం నాయకులు ఈదుల కృష్ణయ్య,వెంపటి మధు,చందు నాగేశ్వరావు,డాక్టర్ బ్రహ్మం,వీరభద్రా చారి,కృష్ణయ్య,సంగిశెట్టి గోపాల్,రామ్ రెడ్డి,వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular