:కొమరబండ నుండి దుర్గాపురం వరకు మహాత్మా గాంధీ రోడ్డుగా నామకరణానికి ఓకే చెప్పిన ఎమ్మెల్యే
:సత్యమేవ జయతే సేవాసమితి ఆధ్వర్యంలో గాంధీ 154వ జయంతి వేడుకలు
:గాంధీ ఆశయాలను ముందుకు తీసుకు పోవడంలో యువత పాత్ర ఎంతో కీలకం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ,అక్టోబర్ 02(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక బస్టాండ్ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సత్యమేవ జయతే సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాదెళ్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని గాంధీ విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము,అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.సహాయ నిరాకరణ,సత్యాగ్రహము అతని ఆయుధాలు అన్నారు కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి,నూలు వడకి,మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడని అన్నారు.ఆ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో “బాపు”అనీ,”మహాత్ముడు” అనీ పిలుచుకొనసాగారు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము అని అన్నారు. అనంతరం సత్యమేవ జయతే సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ కొమరబండ నుండి దుర్గాపురం వరకు మహాత్మా గాంధీ రోడ్డు(ఎంజీ రోడ్డు)గా నామకరణం చెయ్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ని అడగగా వెంటనే స్పందించిన ఓకే చెప్పిన ఎమ్మెల్యేకు హర్షం వ్యక్తం చేసిన సేవా సమితి సభ్యులు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు,పుట్టా సురేంద్రబాబు,తేజ జానకి రామయ్య,భాస్కర్,భరణి రెడ్డి,రహీం,రవితేజ,వీరభద్రరావు,వీరబాబు,శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



