అనంతగిరి,అక్టోబర్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని త్రిపురవరం గ్రామంలో శ్రీ మహాత్మా యూత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మహాత్మ యూత్ అధ్యక్షులు దొంతగాని మధు పాల్గొని మాత్మ గాంధీ విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి పూలమాలలు వేసిన యూత్ సభ్యులు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.ప్రజలు అతన్ని మహాత్ముడని,జాతిపిత అని గౌరవిస్తారు.సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు అని అన్నారు. మాత్మ గాంధీ ఆశయాలు ముందుకు పోవాలంటే యువత పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు.అహింసా మార్గం ద్వారా స్వతంత్రాన్ని తీసుకురావడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషిచేసి చివరికి విజయం సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు నరసింహారావు వీరబాబు శ్రీనివాస్ లక్ష్మారెడ్డి సతీష్ ఉపేందర్ రెడ్డి దుర్గాప్రసాద్ సాయి నరేష్ శ్రీకాంత్ ఉపేందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మహాత్మా గాంధీ:దొంతగాని మధు
RELATED ARTICLES



