హైదరాబాద్,అక్టోబర్ 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అక్టోబరు 3 తెల్లవారుజాము నుండి ఢిల్లీ పోలీసులు పలువురు జర్నలిస్టులు, స్టాండ్-అప్ కమెడియన్‌లు, వ్యంగ్య రచయితలు, శాస్త్రవేత్తలు, సాంస్కృతిక చరిత్రకారులు మరియు వ్యాఖ్యాతల ఇళ్లపై దాడులు చేయడాన్ని, వారిపై క్రూరమైన ఉపా చట్టం ద్వారా వివిధ సెక్షన్లు ప్రయోగించి ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయడాన్ని ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ఖండించారు.
ఇది మీడియాపై, భావప్రకటనా స్వేచ్ఛపై, ప్రాథమిక హక్కులపై హేయమైన దాడియని,గత తొమ్మిదేళ్లలో,కేంద్ర ప్రభుత్వం బిబిసి, న్యూస్ లాండ్రీ, దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్, ది కాశ్మీర్ వాలా , ది వైర్ వంటి వివిధ మీడియా సంస్థలను అణచివేయడానికి, వేధించడానికి మరియు భయపెట్టడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని, ఇప్పుడు న్యూస్ క్లిక్ దానితో సంబంధం ఉన్న వారందరిపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు. నిజాన్ని మాత్రమే ప్రజలకు చేరవేసే మీడియా సంస్థలు మరియు జర్నలిస్టులపై ఇంత పెద్ద ఎత్తున నిరంకుశ దాడి చేయడం ఆమోదయోగ్యం కాని విషయమని ఆయన అన్నారు.
ప్రజల తరపున ఉద్యమిస్తున్న మీడియాను లక్ష్యంగా చేసుకుని వారిని హింసించటం మరియు అణిచివేసేందుకు చేస్తున్నటువంటి కుట్రకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య భావాలు కలిగిన దేశభక్తులందరూ ఐక్యంగా ఉద్యమించాలని వి. కృష్ణ మోహన్ పిలుపునిచ్చారు.
వి. కృష్ణ మోహన్
నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)
కార్యదర్శి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసీయేషన్ (టాప్రా) నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సి.సి.పి.ఏ) అనుబంధం 9182189533, 9440668281



