- సమాచార వనరులను బలోపేతం చేసుకోవాలి:ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్.
కోదాడ,అక్టోబర్ 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 కు సంబంధించి ఈరోజు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ కోదాడ డిఎస్పీ కార్యాలయం నందు కోదాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు సిబ్బందితో ఎన్నికల సమాయత్తం సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.ఈ సమావేశం నందు ఎన్నికల నియమావళి అమలు చేయడంలో పోలీస్ శాఖ తీసుకోవాల్సిన వ్యూహాలు,ముందస్తు ప్రణాళిక గురించి చర్చించి సిబ్బందికి పలు అంశాలపై సూచనలు సలహాలను ఎస్పీ అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో భారత ఎన్నికల బృందం పర్యటన సందర్భంగా ఎన్నికల నిర్వహణపై ప్రాచుర్యం సంతరించుకున్నదని, జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు చేయడం ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిద్ధంగా ఉండాలని తెలిపారు.ముఖ్యంగా అక్రమ రవాణాను అడ్డుకోవాలని మద్యం,గుడుంబా,గంజాయి,డబ్బు మార్పిడి,డబ్బు రవాణా,ఇతర విలువైన వస్తువుల రవాణా జరగకుండా చేయడం,ఎన్నికల్లో ప్రలోభాలకు,ఉచిత బహుమతులను నిరోధించాలని అని కొరినారు.స్థానికంగా గ్రామాలలో పరిస్థితులను గమనిస్తూ ఉండాలని అన్నారు.దీనికిగాను పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన వ్యూహం మరియు ముందస్తుప్రణాళికను అమలు చేయాలని సూచించారు.ముఖ్యంగా కృష్ణపట్టి ప్రాంతం మేళ్లచెరువు చింతలపాలెం మఠంపల్లి పాలకవీడు మండలాల నుండి నకిలీ మద్యం,గుడుంబా,నగదు,రవాణా జరగకుండా,ఇతరత్రా విలువైన వస్తువులు నిరోధించడం కోసం తనిఖీలను ముమ్మరం చేయాలని కోరినారు.ఇతర రాష్ట్రాల నుండి పెద్దమొత్తంలో డబ్బు,బంగారం మొదలగు అక్రమ రవాణా జరగకుండా సంచారం సేకరించాలని,సమాచార వనరులను బలోపేతం చేసుకోవాలని సూచించారు.అనంతరం కోదాడ రూరల్ పరిధిలో గల రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు చెక్పోస్ట్ ను పరిశీలించి వాహనాల తనిఖీలను పరిశీలించారు. వాహనాల తనిఖీలు అప్రమత్తంగా చేయాలని కోరారు.ఈ సమావేశం నందు కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి ప్రకాష్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్,ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ మహేష్,సీఐ లు రాము,వీర రాఘవులు,రామకృష్ణా రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.



