:దళిత బంధు లో పూర్తి పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగుతుంది.
:దళిత బంధు పథకం పై కొంతమంది రాజకీయంగా రెచ్చగొడుతున్నారు.
:దళిత బంధు పథకం నగదు రూపంలో పంచుకునేది కాదు.. సమిష్టి ఉపాధి పథకం.
:దళిత బంధు పథకాన్ని కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలి.
:గృహ లక్ష్మీ పథకం అన్ని గ్రామాలకు అందిస్తాం.
:దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ.
:గృహలక్ష్మి పథకానికి తాసిల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
:దళిత బంధు గృహలక్ష్మి పథకాల్లో అసత్య ప్రచారాలు నమ్మవద్దు.
:గృహ లక్ష్మీ పథకం అన్ని గ్రామాలకు అందిస్తాం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
కోదాడ,సెప్టెంబర్ 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దళిత బంధు పథకంలో దళారులను నమ్మవద్దని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు.శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ….. దళిత బంధు పథకం పూర్తిగా అర్హులకు అందజేస్తామని తెలిపారు.దళిత బంధు పథకంలో కొందరు రాజకీయంగా రెచ్చగొడుతున్నారని దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని ఎలక్షన్ కోడ్ తో సంబంధం ఉండదని చెప్పారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని విభేదాలు సృష్టిస్తున్న ఆయన విమర్శించారు.నియోజకవర్గానికి దళిత బంధు పథకం 1100 మందికి మంజూరు కి అవకాశం ఉందని మరో 200 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో మంజూరయ్యే విధంగా కృషి చేస్తానన్నారు దళిత బంధు పథకం డబ్బులు పంచుకునే పథకం కాదని ఆయా గ్రామాల్లో యూనిట్లను మాదిరిగా ఏర్పడి ఉపాధి అవకాశాలు కల్పించుకుని లబ్ది పొందే పథకం అన్నారు దళిత బంధువు పథకం మంజూరుకు ఆయా గ్రామాల్లో గ్రామ కార్యదర్శులకు లేదా మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు గృహలక్ష్మి పథకం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు మంజూరు చేస్తామన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా 6000 మందికి అవసరమైతే మరి కొంతమందికి పథకం వర్తింప చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం ఆయా మండలాల తాసిల్దారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పథకాల మంజూరులో ఎటువంటి రాజకీయ లబ్ధి కానీ పక్షపాత వైఖరులు కానీ లేవని,అధికారులు దరఖాస్తుదారుల అర్హతలను బట్టి పారదర్శకంగా ఎంపిక చేస్తారని తెలిపారు.



