కోదాడ,అక్టోబర్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:విద్యార్థి ఉద్యమాలకు పురుడు పోసిన కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల 1981 -84 బ్యాచ్ బి ఏ విద్యార్థులు ఆదివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించారు.కళాశాల చదువు పూర్తి చేసుకుని నాలుగు దశాబ్దాలు అయిన తర్వాత వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్న ఆరు పదుల వయసు దాటిన మిత్రులందరూ కలుసుకొని ఆనంద సంబరాలు మునిగిపోయారు.కళాశాలల నాటిజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విద్యార్థి ఉద్యమాల్లో ఈ బ్యాచ్ ప్రత్యేక గుర్తింపు పొందినట్లుగా నేటికీ కళాశాల చరిత్ర చెబుతుంది.తొలుత ఆ బ్యాచ్ లో మృతి చెందిన గడ్డం విద్యా సాగర్ రెడ్డి తోపాటు పలువురికి ఘనంగా నివాళులర్పించారు.ఉన్నత స్థానాల్లో ఉన్న విద్యార్థులను చూసి గురువులు గర్వంగా ప్రసంగించారు.తమకు విద్యా బుద్ధు లు నేర్పిన నాటిగురువులు శ్రీరామ శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు,మంత్రి ప్రగడ బరతారావు,రంగారావు ప్రసన్నాంజనేయులు,అందే సత్యం,మేరీ కుట్టి జోసెఫ్ లను శాలువాలు ఘనంగా సత్కరించారు.ఈ కళాశాలలో చదువుకోవటం తమ అదృష్టమని గురువులు తమకు విద్యతోపాటు సంస్కారాన్ని కూడా నేర్పారని సమాజం పట్ల గురుతరమైన బాధ్యతను అవగతం చేశారని పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సమయంలో పూర్వ విద్యార్థులు కే రమేష్,తుమ్మ ప్రసాదు,కెవి శశిధర్,కోనేరు శ్రీనివాసరావు,వక్కవంతుల నాగార్జున,యస్ రామిరెడ్డి ,పందిరి నాగిరెడ్డి,కోడారు రాణి,విజయ,ఇందిరా,నరసింహారావు,రాఘవరావు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.:1981-84 కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల బిఏ బ్యాచ్ అపూర్వ కలయిక.:నాలుగు దశాబ్దాల అనంతరం కలుసుకున్న మిత్రులు.
RELATED ARTICLES



