*🍥 ఖమ్మం,అక్టోబర్ 16(mbmtelugunews) ప్రతినిధి బంకా వెంకటరత్నం:మణుగూరు పట్టణం, మధిర పట్టణం, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. గత ఎన్నికల వరకు దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. అయితే వారిని తీసుకొచ్చి ఓటు వేయించటం సహాయకులకు కష్టంగా ఉండేది. వ్యయప్రయాసలకోర్చలేక కొంతమంది ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈసారి అలాంటి వారికి ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.*
*💥ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?*
*🌀దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచి ఓటు వేయాలంటే ఎన్నికల సంఘం జారీ చేసిన 12డీ ఫారం పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఫారాల్ని పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందే బీఎల్వోలకు సమర్పించాలి. ఫారాలను అందజేసేందుకు నిర్దుష్ట తేదీలను ఎన్నికల సంఘం తెలియజేస్తుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తయి, పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలైన మరుసటి రోజు నుంచే 12డీ దరఖాస్తుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకు నోడల్ అధికారిని కూడా నియమిస్తారు. బ్యాలెట్ ఓటు అమలుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆ సమయంలో అర్హులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.*



