కోదాడ,అక్టోబర్ 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకొని నియోజకవర్గానికి చేరుకున్న ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు సోమవారం నియోజకవర్గ ముఖద్వారమైన మునగాల మండలం మాధవరం గ్రామం నుండి నియోజకవర్గ ప్రజలచే ఘన స్వాగతం లభించింది.నియోజకవర్గం లోని పలు మండలాల నుండి అభిమానులు కార్యకర్తలు నాయకులు పూలదండలు శాలువాలతో సత్కరిస్తూ స్వాగతించారు.మాధవరం నుండి వందల సంఖ్యలో బైక్లు కార్లతో కోదాడ వరకు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.పట్టణానికి చేరుకున్న అనంతరం బొడ్రాయి అమ్మవారి వద్ద సతీమణి ఇందిరతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అభిమానమే ముఖ్యమంత్రి చే రెండవసారి బీఫామ్ అందుకునేలా చేసిందన్నారు.గత ఐదు సంవత్సరాలుగా కోదాడ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగోన్నానన్నాను,అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికై కృషి చేశానన్నారు.నియోజకవర్గం ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో నా గెలుపు ఖాయమైందన్నారు.మెజారిటీ ఎంత మాత్రమే చూడాలన్నారు.రెండవసారి నన్ను ఎమ్మెల్యేగాను మూడవసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగాను చేయవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కోదాడ నియోజకవర్గంలో రెండవసారి గులాబీ జెండా ఎగరవేసి కేసిఆర్ కి కేటీఆర్ కి బహుమతిగా ఈయడంలో కార్యకర్తలు సైనికుల పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



