కోదాడ,అక్టోబర్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడకు చెందిన వైశ్య సంఘం నాయకుడు పలు సేవా సంస్థలలో సభ్యునిగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ఓరుగంటి కిట్టు. హైదరాబాదులో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఓరుగంటి కిట్టుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కిట్టు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే పథకాలను చూసి ప్రజలు ఆకర్షితులై పట్టణాలలో గ్రామాలలో బిజెపి పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు.రానున్న సాధారణ ఎన్నికలలో కోదాడ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన వెంట సంకినేని వెంకటేశ్వరరావు,బొబ్బ భాగ్యరెడ్డి,కనగాల నారాయణ,బొలిశెట్టి కృష్ణయ్య తదితరులు ఉన్నారు.
బిజెపిలో చేరిన ఓరుగంటి కిట్టు
RELATED ARTICLES



