కోదాడ,అక్టోబర్ 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బిఅర్ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు గౌరవం లేదని స్థానిక శాసనసభ్యులు ఒంటెద్దు పోకడతో అనేక అవమానాలు భరించామని..గత తొమ్మిది సంవత్సరాలుగా భారత్ రాష్ట్ర సమితి పార్టీ అభివృద్ధికి సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు నిర్వహించి అవమానాల పాలు కావడంతో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గ బీసీ నాయకులు,కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కెఎల్ఎన్ ప్రసాద్ తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటికీ నాటి తెలుగుదేశం పార్టీలో రాష్ట్రస్థాయి బీసీ నాయకుడిగా ఎన్నో సేవలందించి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాడు పార్టీకి సేవలు అందించినట్లు తెలిపారు.మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో అధిష్టానం హామీ మేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర కౌన్సిలర్ల సంఘం పెట్టి వివిధ పార్టీల కౌన్సిలర్లు అందరినీ బిఆర్ఎస్ పార్టీలో చేర్పించానని,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లాలో గీత కార్మికులకు గీత కార్మిక లైసెన్సులను ఇప్పిచ్చి వారిని టిఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులయ్యేటట్టు చేశానని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ సొంత ఖర్చులతో పార్టీ అభివృద్ధికి పాటుపడిన పార్టీ గుర్తించకపోవడం బాధాకరమన్నారు.కోదాడ నియోజకవర్గంలో బిసి ఎమ్మెల్యేగా ఉండి బీసీ నాయకులకు కనీస గౌరవం లభించకపోవడం దురదృష్టకరమని అన్నారు.గత వారంలో స్థానిక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నివాసానికి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ కావాల్సిందిగా ఆహ్వానించినందున రెండు మూడు రోజుల్లో కొందరు ప్రజాప్రతినిధులు కుల సంఘ నాయకులు, తన అనుచరులు సుమారు 2000 నుంచి 3000 మందికాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.తన రాజీనామా పత్రాన్ని జిల్లా ఇంచార్జ్ తక్కెళ్ళపల్లి రవీందర్రావు,జిల్లా అధ్యక్షులు బడుగు లింగ యాదవ్,విద్యుత్తు శాఖ మాత్యులు జగదీశ్వర్ రెడ్డిలకు తన రాజీనామా పత్రాన్ని పంపినట్లు తెలిపారు. కేఎల్ఎన్ పార్టీని వీడడం వలన బిఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరుగుతాదని పలువురు వారి యొక్క ఆవేదనను వెల్లబుచ్చారు.
అవమానాలు బరించలేకే రాజీనామా:కౌడిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అద్యక్షలు కే ఎల్ ఎన్ ప్రసాద్.
RELATED ARTICLES



