కోదాడ,అక్టోబర్ 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రముఖ న్యాయవాది,జాతీయ కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు,తెలంగాణ మున్సిపల్ కౌన్సిలర్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేఎల్ఎన్ ప్రసాద్ గౌడ్ ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గంలోని వివిధ సంఘాల ముఖ్య అనుచరులు సుమారు 800 మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతు కేఎల్ఎన్ ప్రసాద్ మాకు చిరకాల స్నేహితుడు,ఎంగ్ అండ్ డైనమిక్ లీడర్,నిబద్ధత నిజాయితీ గల వ్యక్తి అని ఆయన రాకతో కోదాడ మరియు హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని అన్నారు.రాబోయే రోజులలో కేఎల్ఎన్ కి మంచి సముచిత స్థానం కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కోదాడ నియోజకవర్గం నుండి ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తుందని,50వేల మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేఎల్ఎన్ నిరా కల్లును రుచి చూపించారు.అనంతరం కేఎల్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ చేరికలు కేవలం నియోజకవర్గం లోని గీత కార్మిక సంఘం మరియు వివిధ సంఘాల ముఖ్య కార్యకర్తలతో చేరడం జరిగింది రాబోయే రోజులలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో భారీ చేరికలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఉత్తమ్ దంపతులను గజమాలతో సత్కరించిన కేఎల్ఎన్.ఈ కార్యక్రమంలో వంగవీటి రామారావు,కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు,గంధం యాదగిరి,షాబుద్దీన్,ఒంటిపులి వెంకటేష్,బషీర్,పార్టీలో చేరిన వారు పాలారం సర్పంచ్ బెల్లంకొండ కిరణ్,అనంతగిరి బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మొక్క రమేష్,కోదాడ నియోజకవర్గం టిఆర్ఎస్వి మాజీ అధ్యక్షులు బెల్లంకొండ సతీష్,మాజీ ప్రధాన కార్యదర్శి పోలంపల్లి వీరేందర్ గౌడ్,మాజీ కార్యదర్శి సోమగాని బాలా గౌడ్,30 వ వార్డు మాజీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలేబోయిన శ్రీనివాస్,కాపుగల్లు గౌడ సొసైటీ అధ్యక్షులు కాసాని వీరబాబు,గణపవరం సొసైటీ అధ్యక్షులు కారింగుల వీరయ్య, స్థానిక 12వ బ్లాక్ మహిళా ప్రతినిధులు బొడ్డుపల్లి సుమలత,చెరుకుపల్లి శోభ,గణపవరం,రజక సంఘం ప్రతినిధులు భూమా శ్రీనివాస్,ఉల్లెందులసతీష్,వీరయ్య మరియు కెఎల్ఎన్ యువసేన ప్రతినిధులు కె శ్రావణ్ కుమార్,షేక్ జానీ,రంగా,శివ,గోపి,రవి,తోగరాయి,కాపుగల్లు,లక్ష్మీపురం,సాలార్జంగ్ పేట,ఆకుపాముల,రామసముద్రం,పాలవరం,గుడిబండ,ఖానాపురం, నియోజకవర్గ కౌండిన్య గౌడ సంఘ ప్రతినిధులు,తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున పార్టీలో చేరినారు.



