Friday, December 26, 2025
[t4b-ticker]

ప్రైవేట్ విద్యుత్తు కార్మికుల ఆత్మీయ సమ్మేళనం:కోదాడ లో రెండవసారి గులాబీ జెండా ఎగరవేయాలని ఏకగ్రీవ తీర్మానం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ,నవంబర్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ పనిచేస్తున్నదని,సీఎం కేసీఆర్‌ పాలనలో కార్మికులు,కర్షకులు,చేతివృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండాయని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ప్రైవేట్ విద్యుత్ వర్కర్స్ యూనియన్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ కి మద్దతుగా ప్రైవేట్ విద్యుత్ కార్మికులు రెండోసారి కోదాడ గడ్డ పైన గులాబీ జెండా ఎగరేయాలని తీర్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ……, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా కృషిచేశామన్నారు.అతి తక్కువ కాలంలో అని రంగాల్లో అభివృద్ధి సాధించడం తో పాటు కార్మికులను సైతం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఆత్మ గౌరవాన్ని మరింత పెంచుతున్నామన్నారు.2014కు ముందు కార్మికులు పనిచేసేందుకు కూడా పనిదొరికేది కాదని,ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలు,వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు.కాంగ్రెస్‌ చెప్పే మాటలు వింటే మళ్లీ పదేండ్లు వెనకకు పోయి కరువు విలయతాండవం చేస్తున్నదన్నారు.కార్మికులు,కర్షకులు ఇతర పార్టీలకు ఓటు వేయకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి కోదాడ నియోజకవర్గంలో భారీ మెజార్టీని ఇవ్వాలని కోరారు.నిరంతర విద్యుత్,పుష్కలమైన నీరు లభిస్తున్న తెలంగాణ పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామం గా నిలిచిందన్నారు.దీంతో పెద్దపెద్ద వ్యాపార సమస్యల సైతం తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు.రాబోయే రోజుల్లో కోదాడ కు పారిశ్రామిక హభ్ గా తీర్చి దిడ్డడమే తన లక్ష్యమని అన్నారు.తద్వారా పదివేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే సంకల్పంగా ముందుకు వెళ్తానన్నారు.గతంలో కోదాడలో వ్యాపారాలు చేసుకోవాలంటే ఇటువంటి పరిస్థితులు ఉండేవో ఒక్కసారి ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.రాబోయే ఎన్నికల సందర్భంగా కార్మికులు ఇచ్చిన మద్దతు తన మీద బాధ్యత పెంచిదన్న ఎమ్మెల్యే,నాపై కార్మిక సోదరులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular