Friday, December 26, 2025
[t4b-ticker]

ఎంపీ ఉత్తమ్ మాజీ ఎమ్మెల్యే చందర్రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తమ్మర 4 వార్డు కౌన్సిలర్ సామినేని ప్రమీల రమేష్,3 వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్

:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రానున్నాయి…ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే చందర్ రావు

కోదాడ,నవంబర్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీలో చేరిన అందరికీ సముచిత స్థానం ఉంటుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చందర్రావులు అన్నారు. పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెం బిఆర్ఎస్ పార్టీ 4 వార్డు కౌన్సిలర్,మాజీ సర్పంచ్ సామినేని ప్రమీల రమేష్,3 వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్ (టిడిపి) బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ ఉత్తమ్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు.ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ నియంతృత్వ విధానాలకు విసిగిపోయి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అల్ప బుద్ధి వారికి అధికారం ఇస్తే మంచివారిని పక్కకు పంపుతారు అని వేమన గతంలోనే చెప్పినారు ముఖ్యమంత్రి నోటా ఎమ్మెల్యే బొల్లం ఓటమి గతంలో కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యేల మీద అవినీతి మరకలేదు కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయి నియోజకవర్గ మొత్తం దోచుకున్నాడు గ్రామాలకు పట్టణాలకు మండలాలకు విశేష సేవలు అందించిన సామినేని ప్రమీల రమేష్,నరేష్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలతో అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రానున్నాయి అన్నారు. ఎమ్మెల్యే పద్మావతిని గెలిపించిన వారం రోజులలో కోదాడలో వంద పడకల హాస్పిటల్ చేస్తానని అన్నారు.మాజీ ఎమ్మెల్యే చందర్రావు మాట్లాడుతూ సాండ్,ల్యాండు,మైన్స్,వైన్స్,మట్టి,గాంజా పోలీస్ పవర్ ఉపయోగించి దొరికిన కాడికి దోచుకున్నాడు ఇటువంటి ఎమ్మెల్యేను చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని అన్నారు. అధికార పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీస్ కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన ఏకైక ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యే అని అన్నారు.ఎమ్మెల్యే అభ్యర్థి పద్మావతి మాట్లాడుతూ ఈనెల 10 సాయంత్రం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రోడ్ షో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు కోదాడలో నిర్వహిస్తున్నాము కావున పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రవర్తన శాసనసభ్యుడు ప్రవర్తన చాలా దుర్మార్గంగా ప్రమాదకరంగా ఉందని అన్నారు.అనంతరం సామినేని ప్రమీల రమేష్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో బీసీ నాయకుడు అని చెప్పుకొని ఓట్లు వేయించుకొని బీసీలనే అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నాడు అటువంటి ఎమ్మెల్యేను కోదాడ నియోజకవర్గంలో చిత్తుచిత్తుగా ఓడించి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు వేల మంది కార్యకర్తలకు ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండి వారికి అండగా ఉంటామని అన్నారు. అనంతరం స్వామినేని నరేష్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గెలుపుకి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. మా మాట నమ్మి ఇంతమంది జనం కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం కాపుగల్లు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ఎంపీటీసీ చలసాని శ్రీలత జగన్ 800 మంది బిఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరినారు.ఈ కార్యక్రమంలో ఎర్నేని వెంకటరత్నం బాబు,ముత్తవరపు పాండురంగారావు,సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి,కేఎల్ఎన్ ప్రసాద్,తొండపు సతీష్,బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,కనగాల రాధాకృష్ణ, నన్నేసాహెబు,వంగూరి ఏసుపాదం,షేక్ జానీ,డేగ శ్రీధర్,డేగ కొండయ్య,గరినే కోటేశ్వరరావు,పందిరి నాగిరెడ్డి,బాణాల నాగరాజు,వివిధ మండలాల జడ్పిటిసిలు,ఎంపీపీలు,కౌన్సిలర్లు,సర్పంచులు,వార్డు మెంబర్లు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular