కోదాడ,నవంబర్ 17(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో సహా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నతస్థాయి హోదా లేదా పోలిట్ బ్యూరోలో బాధ్యత కలిగిన ఒక్క నాయకుడు కూడా తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఏపార్టీకి మద్దతు ప్రకటించలేదని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నాయకులు ఎవరూ ఎక్కడా ఏపార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొనటం లేదు అని అన్నారు.స్థానికంగా అక్కడక్కడ టీడీపీ పేరుతో,జెండాలతో కార్యకర్త లెవరైనా ఏపార్టీకైనా మద్దతు ప్రకటిస్తుంటే అది వారి ఆత్మప్రభోదానుసారమే కానీ ఇందులో పార్టీ అధిష్టానం ప్రమేయమేమి లేదని గమనించాలని అన్నారు. కోదాడలో జనసేన అభ్యర్థి టిడిపి జెండాలు ప్రచార వాహనాలకు కట్టుకొని ప్రచారం చేస్తున్నాడని చరవాణి ద్వారా కొల్లు వెంకటేశ్వరరావుని అడగగా మా పార్టీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఏపార్టీకి మద్దతు ప్రకటించలేదు: కొల్లు వెంకటేశ్వర రావు
RELATED ARTICLES



